IPL: ప్రీతి జింటా జట్టు పేరు మార్పు?

  • ఐపీఎల్ లో నాసిరకమైన ప్రదర్శనతో చతికిలపడ్డ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
  • గతంలో హోం గ్రౌండ్ మార్చాలని నిర్ణయం 
  • తాజాగా జట్టు పేరు మార్చేందుకు బీసీసీఐకి అర్జీ
ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ పేరు మార్చుకోనుందా? అంటే బీసీసీఐ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో మొహాలీ నుంచి వేరే నగరానికి వేదికను మార్చాలని కోరిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యాజమాన్యం, తాజాగా తమ జట్టు పేరు మార్చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ బీసీసీఐకి అర్జీ పెట్టుకుంది. దీంతో ప్రీతీ జింటా జట్టు పేరు మారే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి.

కాగా, ఐపీఎల్ ఆరంభం నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లున్నప్పటికీ ఆ స్థాయి విజయాలు సాధించడంలో చతికిలపడింది. ఎన్ని ప్రణాళికలు రచించినా జట్టు ప్రదర్శన తీరు మారలేదు. దీంతో వేదికను మార్చాలని ఆ జట్టు యాజమాన్యం గతంలో బీసీసీఐని కోరింది. తాజాగా జట్టు పేరు మార్చాలని భావిస్తోంది. 
IPL
kings elleven punjab
preeti zinta

More Telugu News