Jana Sena: 25 మందితో పవన్ కల్యాణ్ భేటీ.. త్వరలో ఆ వివరాలు వెల్లడి చేయనున్న జనసేన చీఫ్?
- తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్
- ఇటీవల 25 మందితో భేటీ అయిన పవన్?
- త్వరలో వారి పేర్లు వెల్లడిస్తారన్న కల్యాణ్ సుంకర
మరో నెల రోజుల్లో పవన్ నుంచి సంచలన ప్రకటన రాబోతోందా? అంటే అవుననే అంటున్నారు జనసేన అభిమాని కల్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. జనసేన అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్న ఆయన ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల 25 మంది ప్రముఖులతో భేటీ అయ్యారనే వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఆ 25 మంది ఎవరు? అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ విషయంపై కల్యాణ్ సుంకర మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు పవన్ ఆ విషయాన్ని వెల్లడిస్తారని పేర్కొన్నారు. సమయం, సందర్భాన్ని బట్టి ఆ 25 మంది పేర్లను పవన్ బయటపెడతారని వివరించారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ముందుకు వెళ్లే ఉద్దేశం పవన్‌కు లేదని పేర్కొన్నారు.
మూడేళ్ల క్రితమే జనసేన నియామకాలు జరిగాయని చెప్పిన ఆయన తెలంగాణకు ఇన్‌చార్జ్‌గా శంకర్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి, మీడియా హెడ్‌గా హరిప్రసాద్ ఉన్నారని పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో కొత్త కార్యవర్గం ఏర్పాటవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తే అతి త్వరలోనే పవన్ ఆ 25 మంది ప్రముఖుల పేర్లను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.