kcr: తెలంగాణలో కేసీఆర్ బంగారు కుటుంబం తప్ప..‘బంగారు తెలంగాణ’ లేదు : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

  • తెలంగాణలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతోంది
  • కేసీఆర్ కుటుంబం తప్ప, రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు
  • కేటీఆర్ కు దావోస్ సదస్సుకు ఆహ్వానం అందలేదు
  • ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు: ఉత్తమ్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేలు జరుగుతుందని నమ్మిన అందరూ మోసపోయారని, కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతోందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప, రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. కేటీఆర్ సూటుబూటుతోనే కాలం గడిపేస్తున్నారని, దావోస్ సదస్సుకు ఆహ్వానం ఉందని కేటీఆర్ చెబుతున్న మాటలు అవాస్తవమని, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి..దావోస్ కు కేటీఆర్ దరఖాస్తు చేసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయమై కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే స్పందించాలని, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ చెబుతున్న మాటలన్నీ అబద్ధమని ఆరోపించారు.
kcr
Telangana
Congress
Uttam Kumar Reddy

More Telugu News