charan: 'రంగస్థలం' కోసం ఆ రొమాంటిక్ సాంగ్ చేయరట!

షార్ట్స్‌లో చూడండి
తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చేంత వరకూ సుకుమార్ కసరత్తు చేస్తూనే ఉంటాడు. అందువల్లనే సినిమా .. సినిమాకి ఆయనను అభినందించే ప్రముఖుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఆయన తాజా చిత్రంగా 'రంగస్థలం' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్ .. సమంతపై కొత్తగా ఉండేలా ఒక రొమాంటిక్ సాంగ్ చేయించాలని సుకుమార్ అనుకున్నాడట. దేవిశ్రీ ప్రసాద్ తో ఒక స్పెషల్ ట్యూన్ కూడా చేయించాడట.

అయితే కాస్త డోస్ ఎక్కువగా వుండే రొమాంటిక్ సాంగ్ ను చేయడానికి సమంత సిద్ధంగా లేకపోవడం .. ప్రస్తుతం ఆమె 'మహానటి' సినిమా షూటింగులో బిజీగా ఉండటం వలన, ఇక ఈ సాంగ్ చేయకపోవడమే మంచిదనే నిర్ణయానికి సుకుమార్ వచ్చేశాడని అంటున్నారు. అలా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ తగ్గిందన్న మాట. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను, మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.    
Go Back to Shorts
charan
samanta

More Telugu News