ntr: ఒక వ్యక్తిగా ఎన్టీఆర్ ఆరాధనీయుడు .. చంద్రబాబునాయుడు పనితనంలో దిట్ట: కేవీ రమణాచారి

  • చంద్రబాబుకు ఐఏఎస్ కావాలనే కోరిక ఉండేది
  • సీఎం అయిన తర్వాత ఓ ఐఏఎస్, సీఈఓలా వ్యవహరించారు 
  • హైదరాబాద్ ను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు: రమణాచారి
ముఖ్యమంత్రిగా కన్నా ఒక వ్యక్తిగా ఎన్టీఆర్ ఆరాధనీయమైన మనిషి అని నాడు ఆయన వద్ద పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి వద్ద ఆయన పని చేశారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సలహాదారుడిగా ఉన్న ఆయన ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడు పనితనంలో దిట్ట. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఉన్న అడ్మినిస్ట్రేషన్ కు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్మినిస్టేషన్ కు చాలా తేడా ఉంది. ప్రతి ఆఫీసర్, ఉద్యోగి పనితనం వల్ల మెరుగ్గా ఉండాలని ఆలోచించిన, తన పనితనాన్ని చూపించిన వ్యక్తి చంద్రబాబునాయుడుగారు. చంద్రబాబుకు ఐఏఎస్ కావాలనే కోరిక ఉండేది. కాలేకపోయారు కనుక, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఐఏఎస్ లా, సీఈఓలా చంద్రబాబు వ్యవహరించారు. హైదరాబాద్ ను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన’ అని చెప్పుకొచ్చారు.
ntr
Chandrababu
kv ramanachari

More Telugu News