hero nani: కారును యాక్సిడెంట్ చేసింది నాని డ్రైవర్ కాదట!

  • శుక్రవారం తెల్లవారుజామున నాని కారుకు యాక్సిడెంట్
  • నిద్రమత్తులో డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడంటూ కథనాలు
  • నానియే కార్ డ్రైమ్ చేశాడంటూ కొత్త కథనం
టాలీవుడ్ యంగ్ హీరో నాని కారు యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఈ ప్రమాదం జరిగింది. లేట్ నైట్ షూటింగ్ ముగించుకుని వస్తుండగా, డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో, కారు కరెంట్ పోల్ ను ఢీకొందని ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నానితో పాటు అతని తండ్రి కూడా ఉన్నారని... ఇద్దరికీ గాయాలు కావడంతో కారును అక్కడే వదిలేసి వెళ్లారని మరి కొందరు చెప్పారు.

తాజాగా, మరో కథనం వెలుగులోకి వచ్చింది. కారును నాని డ్రైవర్ నడపలేదని, నానియే డ్రైవ్ చేశాడనేది కొత్త కథనం. కారు యాక్సిడెంట్ కు గురి కాగానే, తన డ్రైవర్ ను స్పాట్ కు పిలిపించి, అతనికి పరిస్థితిని వివరించి వెళ్లిపోయాడని సమాచారం. ఫిలింనగర్ లో ఈ మేరకు గుసగుసలు వినిపిస్తున్నాయి.
hero nani
nani
car accident
tollywood

More Telugu News