Pawan Kalyan: సత్యసాయి సమాధిని దర్శించుకున్న పవన్.. చిత్ర మాలిక!

  • ట్రస్ట్ సభ్యులు రత్నాకర్‌తో భేటీ
  • సత్యసాయి ఆరాధ్యనీయుడన్న పవర్ స్టార్
  • జిల్లా సమస్యలు, రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్న పవన్
అనంతపురం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ రోజు ఉదయం ప్రశాంతి నిలయంలోని శాంతి‌భవన్‌లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్‌తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య దాదాపు అర్థగంటకుపైగా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి సత్యసాయి సమాధిని దర్శించుకుని అక్కడే ఉన్న అత్యాధునిక ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, పుట్టపర్తి ఆసుపత్రి అనేక ప్రభుత్వాలకు ఆదర్శమని అన్నారు. తాను చెన్నైలో ఉన్నప్పుడే సత్యసాయి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నానని, ప్రస్తుతం స్వయంగా చూశానని, ఇక్కడికి రావడం తన అదృష్టమని చెప్పారు.

ఇందుకు సంబంధించిన చిత్రాలు..
Pawan Kalyan
Jana Sena

More Telugu News