finance minister: ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి!

  • 2018-19లో జీడీపీ వృద్ధి 7-7.5 శాతం మధ్య వుండొచ్చని అంచనా
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది 6.5 శాతం
  • లోక్‌సభ సమావేశాలు గురువారానికి వాయిదా 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018 ఆర్థిక సర్వేను సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

సర్వే ముఖ్యాంశాలు....
  • 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7 నుంచి 7.5 శాతం మధ్య వుండొచ్చు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది 6.5 శాతానికి చేరుకుంటుంది. 
  • మధ్యకాలికంగా దృష్టి సారించాల్సిన రంగాలు - వ్యవసాయం, విద్య, ఉపాధి. వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తాం.
  • పెరుగుతున్న చమురు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి.
  • సౌదీ ఆరామ్‌కో లిస్టయితే చమురు ధరలు మరింత పెరగొచ్చు.
  • ప్రత్యక్ష పన్నుల వసూలు లక్ష్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చేరుకునే అవకాశం.
  • జీడీపీ వృద్ధి కోసం గత ఏడాది కాలం నుంచి అనేక సంస్కరణలు చేపట్టాం.
  • 2017-18లో ఎగుమతులు వృ‍ద్ధి రేటు 12.1 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది.
  • తొలిసారి భారతీయ చరిత్రలో మహారాష్ట్ర, గుజరాత్‌, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు దేశీయ ఎగుమతుల్లో 70 శాతాన్ని నమోదుచేసినట్టు పేర్కొంది.
  • 2019 ఆర్థిక సంవత్సరంలో సగటున క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 12 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది.
 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
finance minister
Arun Jaitly
parliament

More Telugu News