anasuya: యాంకర్ అనసూయకు మంచు విష్ణు కౌంటర్!

  • మనోజ్ సినిమా 'మిస్టర్ నూకయ్య'లో బేబీ స్టెప్స్ నేర్చుకున్నానన్న అనసూయ
  • అప్పుడు నీవు చిన్నపిల్లవా? అంటూ విష్ణు కౌంటర్
  • 'గాయత్రి' ఆడియో లాంచ్ లో ఆసక్తికర సన్నివేశం
'గాయత్రి' ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సినిమాలో మోహన్ బాబు, మంచు విష్ణులు లీడ్ రోల్స్ పోషించారు. ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ మాట్లాడుతూ, మనోజ్ తో కలసి తాను నటించిన 'మిస్టర్ నూకయ్య' సినమా గురించి మాట్లాడింది. ఆ సినిమాలో తాను బేబీ స్టెప్స్ వేసుకుంటూ, పిచ్చి బట్టలు వేసుకుని, నోటికొచ్చింది వాగుతూ ఉన్నానని చెప్పింది. ఈ సందర్భంగా విష్ణు కల్పించుకున్నాడు. మనోజ్ సినిమాకు నీవు చిన్న పిల్లవా? అంటూ సెటైర్ వేశాడు. 'రేయ్ మనోజ్, నీ సినిమాలో చిన్నపిల్ల అంట' అంటూ మనోజ్ కి చెప్పాడు.

దీనికి సమాధానంగా అనసూయ మాట్లాడుతూ, 'అబ్బ, ఇలాంటివే పట్టుకోండి' అంటూ గట్టిగా నవ్వింది. ప్రొఫెషన్ పరంగా తాను ఆ సినిమాలో బేబే స్టెప్స్ నేర్చుకున్నానని... నేను అప్పుడు బేబీ అని చెప్పలేదని తెలిపింది. 'గాయత్రి' మూవీలో మోహన్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది.
anasuya
manchu vishnu
mohan babu
gayatri movie
Tollywood

More Telugu News