Pawan Kalyan: బాలయ్య ఇలాకాకు బయలుదేరిన పవన్ కల్యాణ్!

  • నేడు హిందూపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
  • ఈ ఉదయం సత్యసాయి సమాధిని దర్శించుకున్న పవర్ స్టార్ 
  • సత్యసాయి ఆరాధ్యనీయుడన్న పవర్ స్టార్
నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో నేడు పవన్ కల్యాణ్ పర్యటన సాగనుండగా, దీన్ని ఘనవిజయం చేసేందుకు జనసేన కార్యకర్తలు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ప్రస్తుత పర్యటన ఎంతో కీలకమని జనసేన నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పుట్టపర్తిలో ఉన్న పవన్, ఈ ఉదయం సత్యసాయి సమాధిని, అత్యాధునిక ఆసుపత్రిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టపర్తి ఆసుపత్రి అనేక ప్రభుత్వాలకు ఆదర్శమని అన్నారు. తాను చెన్నైలో ఉన్నప్పుడే సత్యసాయి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నానని, ప్రస్తుతం స్వయంగా చూశానని, ఇక్కడికి రావడం తన అదృష్టమని చెప్పారు. వివేకానంద, రామకృష్ణ పరమహంసలా తెలుగువారికి సత్యసాయి ఆరాధ్యనీయుడని అన్నారు. పుట్టపర్తి నుంచి ధర్మవరం వెళ్లి చేనేత కార్మికులను కలవనున్న పవన్ కల్యాణ్, ఆపై హిందూపురం చేరుకుని జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. జిల్లా సమస్యలు, రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు.
Pawan Kalyan
Balakrishna
Hindupuram
Puttaparti
Satya Sai

More Telugu News