ram: రామ్ సరసన అనుపమ మళ్లీ ఛాన్స్ కొట్టేసింది!

  • త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ 
  • నిర్మాతగా దిల్ రాజు 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్  
తెలుగు తెరపై స్నేహ తరువాత అందమైన నవ్వుతో ప్రేక్షకుల హృదయాలను దోచేసిన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ పేరు వినిపిస్తుంది. వరుస సక్సెస్ లను సొంతం చేసుకుంటూ .. నటనపరంగా మంచి మార్కులు కొట్టేసిన అనుపమ పరమేశ్వరన్, ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతోపాటు కరుణాకరన్ సినిమా కూడా చేస్తోంది.

తాజాగా రామ్ సినిమా కోసం ఆమెను ఎంపిక చేశారు. రామ్ - అనుపమ ఇంతకుముందు చేసిన 'ఉన్నది ఒకటే జిందగీ' పెద్దగా ఆడలేదు. అయినా నిర్మాత దిల్ రాజు ఆమెనే తీసుకోవడం విశేషం. ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించనున్నాడు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ఒక కీలకమైన పాత్రను పోషించనుండటం విశేషం.   
ram
anupama

More Telugu News