rakul preet singh: రానా, నేను క్లోజ్ అంతే.. మేము లవర్స్ మి కాదు!: రకుల్ ప్రీత్

  • రానా, రకుల్ ప్రేమ గురించి కోలీవుడ్ లో గుసగుసలు
  • మేము మొత్తం 20 మంది ఫ్రెండ్స్
  • మాలో పెళ్లైనవారితో పాటు పెళ్లికానివారు కూడా ఉన్నారు
  • మా మధ్య లవ్ లేదు
తాజాగా కోలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘ధీరన్‌ అధిగారం ఒండ్రు’ మంచి విజయాన్ని నమోదు చేసింది. అలాగే ‘బాహుబలి’, ‘నాన్‌ ఆనైయిట్టాల్‌’ సినిమాలతో రానా కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్ సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

దీనిపై రకుల్ స్పందించింది. రానా, తాను మంచి స్నేహితులమని చెప్పింది. తామంతా కలిసి మొత్తం 20 మంది స్నేహితులమని తెలిపింది. తమ 20 మందిలో పెళ్లైన వారితో పాటు పెళ్లికాని వారు కూడా ఉన్నారని చెప్పింది. తాము తరచు కలుసుకుని సరదాగా గడుపుతుంటామని, అందువల్ల వదంతులు వస్తుంటాయని, తమ మధ్య ప్రేమ లేదని తెలిపింది. 
rakul preet singh
rana
love
kollywood

More Telugu News