Pawan Kalyan: పవన్ పర్యటనలో అపశ్రుతి.. కాన్వాయ్ కారు కింద పడిన యువకుడు

  • కాన్వాయ్‌ను ఆపి విషయం తెలుసుకున్న పవన్
  • గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆదేశం
  • నల్లమాడ వద్ద ఘటన
జనసేనాని పవన్ పర్యటనలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం పవన్ కదిరి నుంచి పుట్టపర్తి వెళ్తుండగా నల్లమాడ వద్ద ఆయన కాన్వాయ్‌లోని ఓ కారు కింద ప్రమాదవశాత్తు మహేశ్ అనే యువకుడు పడ్డాడు. విషయం తెలిసిన పవన్ వెంటనే కాన్వాయ్‌ను ఆపించి కిందికి దిగి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. గాయాలపాలైన యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని అభిమానులకు సూచించారు.

అనంతపురం జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించాలని నిర్ణయించుకున్న పవన్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధ్యయనం చేస్తున్నారు. కదిరిలో నిర్వహించిన సభలో జనసేన చీఫ్ మాట్లాడుతూ అనంతకు ఏదో ఒకటి చేస్తేనే తన జన్మధన్యమైనట్టు భావిస్తానని పేర్కొన్నారు. అనంతరం కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
Pawan Kalyan
Jana Sena
Anantapur
Andhra Pradesh

More Telugu News