- పుట్టపర్తిలో పర్యటించిన జనసేన అధినేత
- సత్యసాయి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే మద్దతిస్తాం
- సత్యసాయి స్ఫూర్తితో ‘జనసేన’ ముందుకు పోతుందన్న పవన్
పుట్టపర్తి సత్యసాయిబాబా సేవలకు గుర్తింపుగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తిలో పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కదిరి పర్యటన ముగించుకుని పుట్టపర్తి చేరుకున్న పవన్ ప్రసంగిస్తూ, సత్యసాయి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో సత్యసాయి విశేష సేవలందించారని, సత్యసాయి స్ఫూర్తితో ‘జనసేన’ ముందుకు పోతుందని చెప్పారు.