USA: అమెరికాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి!

షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో ఉంటున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వెంకన్నగారి కృష్ణ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం డల్లాస్ లో జరిగింది. కృష్ణ చైతన్య స్వస్థలం సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్. కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగ నిమిత్తం మూడున్నరేళ్ల కిందట కృష్ణ చైతన్య అమెరికా వెళ్లాడు. డల్లాస్ లోని సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కంపెనీలోకి మూడు నెలల క్రితం ఆయన మారాడు.

డల్లాస్ లోని ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు.  శుక్రవారం ఉదయం తన గది నుంచి ఆయన ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. అక్కడికి వెళ్లిన పోలీసులు గది తలుపులు తెరచి చూడగా, మంచంపై కృష్ణ చైతన్య నిర్జీవంగా పడి ఉండటం గమనించారు. కాగా, కృష్ణ చైతన్య మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, అతని మృతదేహాన్ని ఇక్కడికి తరలించే ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పర్యవేక్షిస్తున్నారని సమాచారం.
Go Back to Shorts
USA
Telangana
Harish Rao

More Telugu News