Hyderabad: హైదరాబాద్ లో సినీ నటి తమన్నాకు చేదు అనుభవం.. బూటు విసిరిన యువకుడు!

  • హిమాయత్ నగర్ లో గోల్డ్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన నటి
  • ఆమెను చూసేందుకు ఆసక్తి చూపిన అభిమానులు
  • తమన్నా అభివాదం చేస్తుండగా ఆమెపైకి బూటు విసిరిన వ్యక్తి
  • పోలీసుల అదుపులో నిందితుడు
ప్రముఖ సినీనటి తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో మల్ బార్ గోల్డ్ షాప్ ప్రారంభోత్సవం నిమిత్తం ఈరోజు ఆమె వెళ్లింది. తమన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో, తమన్నా బౌన్సర్లు వారిని కంట్రోల్ చేశారు. అభిమానులకు తమన్నా అభివాదం చేస్తుండగా ఓ యువకుడు ఆమెపై బూటు విసిరాడు. అయితే, అతను విసిరిన బూటు, ఆమెకు కొంత దూరంలో పడింది.దీంతో, అతనిపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, తమన్నాపై షూ విసిరిన వ్యక్తి పేరు కరీముల్లా అని సమాచారం.
Hyderabad
Tamannaah

More Telugu News