Rajasthan Royals: వేలంలో సంచలనం... రూ. 1.50 కోట్ల ఉనద్కత్ ను రూ. 11.50 కోట్లకు కొన్న ఆర్ఆర్!
- రాజస్థాన్ రాయల్స్ పరమైన ఉనద్కత్
- ఐపీఎల్ లో రెండో అత్యధిక ధర
- ఉనద్కత్ కోసం పోటీ పడ్డ ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో కొద్దిసేపటి క్రితం పెను సంచలనమే నమోదైంది. సౌరాష్ట్ర రీజియన్ కు చెందిన ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ బేస్ ప్రైస్ రూ. 1.50 కోట్లు కాగా, అతన్ని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలన్నీ పోటీ పడ్డాయి. చూస్తుండగానే ఉనద్కత్ ధర కనీస ధరకు 10 రెట్లు పెరిగిపోయింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఉనద్కత్ ను రూ. 11.50 కోట్లకు సొంతం చేసుకుంది.
దీంతో ప్రస్తుత వేలంలో బెన్ స్టోక్స్ (రూ. 12.50) తరువాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉనద్కత్ నిలిచాడు. గతేడాది ఐపీఎల్ పోటీల్లో పుణె సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగి సత్తా చాటి, వికెట్లు తీయడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ సంవత్సరం అతనికి మంచి డిమాండ్ వచ్చింది.