Pawan Kalyan: పవన్ కోసం పరిటాల వారింట చేసిన వంటకాలివి!

  • పవన్ కోసం స్పెషల్ గా వంటకాలు
  • రాగి సంకటి, పొంగల్, దిబ్బరొట్టెలు
  • పరిటాల ఇంట పవన్ అల్పాహారం
ఈ ఉదయం పవన్ కల్యాణ్ అతిథిగా తన ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న ఏపీ మంత్రి పరిటాల సునీత, ఆయన అల్పాహారం నిమిత్తం ప్రత్యేకంగా వంటకాలను దగ్గరుండి సిద్ధం చేయించారు. ఇడ్లీ, వడ, దిబ్బరొట్టెలతో పాటు రాగి సంకటి, పొంగల్ తయారు చేయించారు. వీటితో పాటు చట్నీ, సాంబార్, కారంపొడి, నెయ్యి తదితరాలను సిద్ధం చేశారు. ఈ ఉదయం పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలసి పవన్ కల్యాణ్ అల్పాహారాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. అల్పాహారం స్వీకరిస్తూనే పరిటాల సునీతతో పవన్ పలు విషయాలను చర్చించినట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి.
Pawan Kalyan
Paritala Sunita
Anantapur District
Breakfast

More Telugu News