nani: నాని కోసం అద్భుతమైన కథను రెడీ చేశాడట!

  • నటుడిగా అవసరాలకి మంచి పేరు 
  • దర్శకుడిగానూ ప్రత్యేకత 
  • నానితో సినిమా చేయడానికి ప్రయత్నాలు
తెలుగు తెరపై కొత్తదనానికి నాని కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలతో సక్సెస్ కు చిరునామాగా అనిపిస్తాడు. అలాంటి నాని కోసం తాను ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశానని అవసరాల శ్రీనివాస్ చెబుతున్నాడు. 'అష్టా చమ్మా' సినిమాలో నాని .. అవసరాల శ్రీనివాస్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నాని హీరోగా ఎదుగుతూ వస్తుంటే, విభిన్నమైన పాత్రలను చేస్తూ .. దర్శకుడిగా కూడా అవసరాల తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

నానితో ఓ సూపర్ హిట్ మూవీ చేస్తానని కొంతకాలం క్రితమే అవసరాల చెప్పాడు. నానికి పెరుగుతోన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆయన కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్టు సన్నిహితులతో అవసరాల చెబుతున్నాడట. నాని కెరియర్లో చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నాడట. ప్రస్తుతం నాని చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తి కాగానే, ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. తాజాగా నాని నిర్మించిన 'అ!' సినిమాలో అవసరాల ఓ కీలకమైన పాత్రను చేసిన సంగతి తెలిసిందే.        
nani
avasarala

More Telugu News