Jana Sena: 2019 ఎన్నికల్లో నేను ఎవరికి మద్దతిస్తానో తెలుసా?: పవన్ కల్యాణ్

  • ఎవ‌రైతే రైతుల‌కు అండ‌గా ఉంటారో వారికి మద్దతిస్తాను
  • అనంత‌పురం రైతాంగం క‌న్నీరుని ఎవ‌రు తుడుస్తారో వారికి అండ‌గా ఉంటా
  • అనంత‌పురానికి అండ‌గా ఎలా నిల‌బ‌డతార‌ని అడుగుతా
  • రైతుల‌కి జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంది
తాను రాబోయే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ప‌లుకుతాన‌న్న ప్రశ్న అందిరిలోనూ ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎవ‌రైతే రైతుల‌కు అండ‌గా ఉంటారో వారికి తాను మ‌ద్ద‌తిస్తానని స్పష్టతనిచ్చారు. ఈ రోజు ఆయన అనంతపురంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... అనంత‌పురం రైతాంగం క‌న్నీరుని ఎవ‌రు తుడుస్తారో వారికి తాను అండ‌గా ఉంటానని చెప్పుకొచ్చారు.

ఏ పార్టీకైనా మ‌ద్ద‌తిచ్చే ముందు అనంత‌పురానికి అండ‌గా ఎలా నిల‌బ‌డతార‌ని అడుగుతానని పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల‌కి జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుందని, అనంత‌పురం నుంచి తనకు మద్దతు కావాలని కోరారు. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు వచ్చి ఓటేయమని అడుగుతారని, అనంతపురానికి ఏం చేశారని నిలదీయాలని చెప్పారు. అలాగే అనంతపురం ప్రజలు ఇష్టమైతేనే జనసేన పార్టీకి ఓటు వేయాలని, లేదంటే తనను ఓడించాలని అన్నారు. 2019 ఎన్నికల్లో అనంతపురం నడుంబిగించకపోతే ఎప్పటికీ ఈ ప్రాంతం సమస్యలు పోవని అన్నారు. 
Jana Sena
Pawan Kalyan
Anantapur District

More Telugu News