Jana Sena: పడిపోయిన బంగారం, వెండిధర!

  • దేశీయ మార్కెట్లో ప‌ది గ్రాముల‌ బంగారం ధర రూ.250 తగ్గి, రూ.31,200గా న‌మోదు
  • గ్లోబ‌ల్ మార్కెట్లో మాత్రం 0.15 శాతం పెరిగి ఔన్సు ధర 1,349.30 డాలర్లకు పసిడి ధర
  • కిలో వెండి ధ‌ర రూ. 350 తగ్గి, వెండి ధర రూ. 40,650గా నమోదు
కొన్ని రోజులుగా బంగారం ధ‌ర‌లు పై పైకి ఎగుస్తూ వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు క‌న‌ప‌డ్డాయి. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం అంత‌గా లేకున్నా, ఆభరణాల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు త‌గ్గిపోవ‌డంతో ఈ రోజు దేశీయ మార్కెట్లో బంగారం ధ‌ర త‌గ్గింది. బులియ‌న్ మార్కెట్లో ప‌ది గ్రాముల‌ బంగారం ధర రూ.250 తగ్గి, రూ.31,200గా న‌మోదైంది. అయితే, గ్లోబ‌ల్ మార్కెట్లో మాత్రం 0.15 శాతం పెరిగి ఔన్సు ధర 1,349.30 డాలర్లకు చేరింది. కాగా, కిలో వెండి ధ‌ర రూ. 350 తగ్గడంతో నేటి మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 40,650గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు త‌గ్గిపోయాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.
Jana Sena
Pawan Kalyan
Anantapur District

More Telugu News