Chandrababu: బీజేపీ మమ్మల్ని వద్దనుకుంటే నమస్కారం పెట్టేస్తాం: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • బీజేపీ అలా చేస్తే మా దారి మేము చూసుకుంటాం
  • బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నాం
  • మిత్రపక్ష ధర్మం పట్ల బీజేపీ నేతలు ఆలోచించుకోవాలి
బీజేపీ తమని వద్దనుకుంటే నమస్కారం పెట్టేస్తామని, తమ దారి తాము చూసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ నేతలపై బీజేపీ నేతలు చేస్తోన్న విమర్శలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బీజేపీతో తాము మిత్రధర్మం పాటిస్తున్నామని, మిత్రపక్ష ధర్మం పట్ల బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా తాను తమ నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నానని అన్నారు.
Chandrababu
amaravati
Andhra Pradesh
BJP
Telugudesam

More Telugu News