galli cricket: బంజారాహిల్స్ లో బౌలింగ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

  • బంజారా హిల్స్ లో రోడ్‌ నం.10లోని జహీరానగర్‌ లోని ఖాళీ స్థలంలో టోర్నీ
  • వరుసగా మూడు బంతులు వేసి నాలుగో బంతి సంధించేందుకు రెండడుగులు వేసి కుప్పకూలిన ఆంటోనీ
క్రికెట్ ఆటలో భాగంగా బౌలింగ్ వేస్తూ యువకుడు మృతి చెందిన విషాద ఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్‌ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.... బంజారా హిల్స్ లోని రోడ్‌ నం.10లోని జహీరానగర్‌ లోని ఖాళీ స్థలంలో టోర్నీ నిర్వహించారు. ఈ టోర్నీలో ప్రత్యర్థికి బౌలింగ్ చేస్తుండగా ఆంటోనీ (23) అనే యువకుడు కుప్పకూలాడు.

వరుసగా మూడు బంతులు వేసిన ఆంటోనీ నాలుగో బంతి సంధించేందుకు రెండడుగులు ముందుకువేసి ముందుకు పడిపోయాడు. సహచర ఆటగాళ్లంతా క్షణాల్లో స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. అప్పటికే ఆంటోనీ మృతి చెందినట్టు ప్రకటించారు. ఆంటోనీ ఒక హోటల్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్ననట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
galli cricket
Hyderabad
banjarahills

More Telugu News