Pawan Kalyan: నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు.. అవసరమైతే చంద్రబాబు, కేసీఆర్ లతో మాట్లాడతా: పవన్ కల్యాణ్

  • సమస్యలు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తా
  • చంద్రబాబు, కేసీఆర్ లను కలుస్తా
  • 25 ఏళ్ల పోరాటం మనది
తనపై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, తాను దేన్నీ పట్టించుకోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు నాయకులందరితో పరిచయాలు ఉన్నాయని... తనకు ఎవరితో శత్రుత్వం లేదని చెప్పారు. సమస్యల సాధన కోసం తాను పని చేస్తానని, ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని అన్నారు.

 రాయలసీమ వ్యాప్తంగా సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వ్యక్తిగతంగా పర్యటిస్తానని, ఆ తర్వాత మేధావులతో చర్చించి, సమస్యలకు పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తానని తెలిపారు. సమస్యల పరిష్కార సాధన కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లను కూడా కలుస్తానని చెప్పారు. మన పోరాటం కేవలం 2019 కోసం మాత్రమే కాదని... 25 ఏళ్లపాటు కొనసాగే పోరాటమని తెలిపారు. 
Pawan Kalyan
janasena

More Telugu News