ramgopal verma: 'సత్యమేవ జయతే'ను...'సత్యమియా జయతే'గా మార్చిన రాంగోపాల్ వర్మ!

  • 'జీఎస్టీ' ప్రమోషన్ కోసం సత్యమేవ జయతే కొటేషన్ ను మార్చేసిన వర్మ
  • సోషల్ మీడియాలో వర్మపై ఆగ్రహం
  • దీపికా పదుకొణేతో మియా మాల్కోవాకు పోలిక
తనకు నచ్చిన విధంగా వ్యాఖ్యలు చేస్తూ, వాటిని తనదైన శైలిలో సమర్ధించుకునే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ చిహ్నంలోని వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పడంతో రిపబ్లిక్ డే రోజున ఆయనపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

'జీఎస్టీ' (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) సినిమా ప్రమోషన్ లో భాగంగా "మన ఇండియన్స్ అంతా.. స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొణే కంటే ఎక్కువగా శృంగార తార మియా మాల్కోవానే ఇష్టపడుతున్నారు. ఈ విషయం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ‘సత్య మియా జయతే’ అంటూ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.  ‘సత్యమేవ జయతే’లో మియా మాల్కోవా పేరును కలిపి 'సత్య ‘మియాజయతే' అని వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో వర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 
ramgopal verma
GST
god S*x&truth

More Telugu News