Telangana: ‘పద్మ’ పురస్కారానికి తెలంగాణలో ఒక్కరు కూడా అర్హులు లేరా? : పొన్నం మండిపాటు

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటీ రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పద్మ’ పురస్కారాన్ని అందుకునేందుకు తెలంగాణలో ఒక్కరు కూడా అర్హులు లేరా? అని ప్రశ్నించారు.

అసలు తెలంగాణకు ‘పద్మ’ పురస్కారాలు దక్కకపోవడానికి కారణాలేంటో టీఆర్ఎస్ సర్కార్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుకు, రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని, అంతే కాకుండా, పార్లమెంట్ లో బీజేపీ లేవనెత్తిన ప్రతి అంశానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రతి అంశానికి ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించే కేటీఆర్, కవితలు.. ఈ విషయమై స్పందించరే? అని పొన్నం ప్రశ్నించారు.
Go Back to Shorts
Telangana
Ponnam Prabhakar
Congress

More Telugu News