MS Dhoni: ధోనీ రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ!

  • టెస్టుల్లో భారత సారథిగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ
  • రెండో స్థానంలో ధోనీ  
  • 60 టెస్టుల్లో 3,454 పరుగులు చేసిన ధోనీ 
  • 35 టెస్టుల్లోనే 3,454 పరుగులను అధిగమించిన కోహ్లీ
జోహన్స్‌బర్గ్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతోన్న చివ‌రి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తోన్న కోహ్లీ క్రీజులో 41 పరుగులతో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు చేసిన ఈ పరుగులతో టెస్టుల్లో భారత సారథిగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. గతంతో మహేంద్ర సింగ్ ధోనీ చేసిన 3454 పరుగుల రికార్డును కోహ్లీ 35 టెస్టుల్లోనే అధిగమించాడు. 3,454 పరుగులను ధోనీ 60 టెస్టుల్లో చేశాడు. కాగా, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత మూడో ఆటగాడిగా గవాస్కర్ ఉన్నారు. ఆయన 47 టెస్టుల్లో 3449 పరుగులు చేశారు. 
MS Dhoni
Virat Kohli
Cricket

More Telugu News