Pawan Kalyan: రేపటి నుంచి పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన
రేపటి నుంచి జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన ప్రారంభమవుతుందని, 'చలోరె చలోరె చల్' కార్యక్రమంలో భాగంగా రేపు అనంతపురంలో కరవుపై అధ్యయనం చేస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకుంటారని ఈ రోజు ఆ పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ పేరిట ప్రకటన విడులైంది. ఈ నెల 28న పవన్ కల్యాణ్ కదిరికి వెళతారని, అనంతరం పుట్టపర్తి, ధర్మవరం, చిక్బల్లాపూర్లలో పర్యటిస్తారని ఈ నెల 29న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని అందులో పేర్కొన్నారు.