Chandrababu: మా లక్ష్యానికి ఆకాశమే హద్దు: దావోస్‌లో చంద్రబాబు నాయుడు

  • పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం
  • సుస్థిర అభివృద్ధి సాధనే మా లక్ష్యం
  • ఆటోమోబైల్ రంగంలో రూ.24,790 కోట్ల పెట్టుబడులు సాధించాం
  • ఆహార శుద్ధి రంగంలోనూ భారీగా పెట్టుబడులు రాబట్టాం
పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలలో తమ లక్ష్యానికి ఆకాశమే హద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దావోస్ లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు ముఖ్యాంశాలను చిత్రీకరిస్తున్న ప్రముఖ పాత్రికేయురాలు, ప్రముఖ వార్తా సంస్థ సీఎన్బీసీ-టీవీ 18 మేనేజింగ్ ఎడిటర్ షెరీన్ భాన్ తో చంద్రబాబు ముఖాముఖిలో మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి సాధనే తమ లక్ష్యమని అన్నారు.

ఇప్పటివరకు సాధించిన పెట్టుబడుల గురించి మాట్లాడుతూ.. ఉదాహరణగా ఆటోమోబైల్ రంగంలో రూ.24,790 కోట్ల పెట్టుబడులను సాధించడమే తమ కృషికి నిదర్శనమన్నారు. ఆహార శుద్ధి రంగంలోనూ భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ ఏడాది 15-20 వృద్ధిరేటును సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
 
Chandrababu
davos switzerland
Andhra Pradesh

More Telugu News