Pawan Kalyan: ఈ శుభతరుణాన భారతీయులందరికీ ప్రేమ పూర్వక శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు. 'భారతదేశం దాస్య శృంఖలాల నుంచి సంపూర్ణంగా విముక్తి పొందిన రోజు.. బ్రిటీష్ వలసవాదుల చట్టాలకు చరమ గీతం పాడిన రోజు.. మహా దార్శినికుడు అంబేద్కర్ నాయకత్వంలో రూపకల్పన జరిగిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా అవతరించిన రోజు.. నిజంగా జనవరి 26 మన జాతి గౌరవించదగిన రోజు.. మనకు పండుగ రోజు. ఈ శుభతరుణాన భారతీయులందరికీ నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రేమ పూర్వక శుభాకాంక్షలు' అని ఆయన అందులో పేర్కొన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Republic Day
wishes

More Telugu News