Pawan Kalyan: పవన్ ఎప్పటికైనా చేరేది ’కాంగ్రెస్’లోనే!: వీహెచ్ జోస్యం

  • ‘కాంగ్రెస్’ తరపున పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తే స్వాగతిస్తాం
  • అలా చేస్తే.. మన ఇద్దరం కలిసి ప్రజల్లో తిరుగుదాం
  • పవన్ కు వీహెచ్ సూచన
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మరోమారు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఎప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీలోనే చేరతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తే స్వాగతిస్తామని, పవన్ తమతో కలసి వస్తే, తామిద్దరం కలిసి ప్రజల్లో తిరుగుదామని వీహెచ్ అన్నారు. ఇక, తనను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలన్న పవన్ వ్యాఖ్యలపై వీహెచ్ మరోమారు స్పందించారు. పార్టీ అధికారంలోకి వస్తే తనకు సీఎం పదవి ఇస్తారా? లేదా? అనేది తమ అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు.
Pawan Kalyan
VH

More Telugu News