Pawan Kalyan: ఆ విషయాన్ని రాహుల్ గాంధీకి పవన్ చెబితే బాగుంటుంది: రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

  • వీహెచ్ ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలని రాహుల్ కు పవన్ చెప్పాలి
  • అవసరమైతే, రాహుల్ వద్దకు తీసుకెళ్తా
  • కేసీఆర్ ను పవన్ పొగడటం దురదృష్టకరం: కాంగ్రెస్ నేత రేవంత్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటిస్తే ఆ పార్టీకి తాను మద్దతు ఇస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ, వీహెచ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ కు పవన్ చెబితే బాగుంటుందని, కావాలంటే, పవన్ ని రాహుల్ వద్దకు తాను తీసుకెళ్తానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పవన్ చేపట్టిన యాత్రలో తన స్థాయికి తగ్గట్టుగా ఆయన మాట్లాడలేదని, సీఎం కేసీఆర్ ను పొగడటం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే పవన్ ని కేసీఆర్ రంగంలోకి దింపారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan
Revanth Reddy

More Telugu News