Andhra Pradesh: ఏపీ సచివాలయ ఉద్యోగుల ఓటర్ ప్రతిజ్ఞ !

  • ప్రజాస్వామ్యం , స్వేచ్ఛ నిలబెడతామని ప్రతిజ్ఞ
  • ప్రమాణం చేయించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి
  • ఎటువంటి ఒత్తిడులకు గురి కాకుండా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సచివాలయం 1వ బ్లాక్ గ్రీవెన్స్ హాల్ లో గురువారం ఉదయం సచివాలయ ఉద్యోగులు ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వారిచేత ప్రమాణం చేయించారు. ‘భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము’ అని ఉద్యోగులు చెప్పారు.
Andhra Pradesh
secreteriat
votersday

More Telugu News