ntr: నాన్న చేయలేకపోయారు.. త్వరలోనే నేను చేస్తా: బాలకృష్ణ

  • రామానుజాచార్య సినిమాను చేయలేకపోయారు
  • త్వరలోనే ఆ చిత్రాన్ని నేను చేస్తా
  • రామానుజాచార్య సంఘ సంస్కర్త కూడా
తన తండ్రి దివంగత తారకరామారావు తీయలేకపోయిన సినిమాను తాను తీస్తానని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. రామానుజాచార్య చిత్రాన్ని త్వరలోనే చేస్తానని చెప్పారు. ఆయన గొప్ప ఆధ్యాత్మిక గురువే కాకుండా, గొప్ప సంఘ సంస్కర్త కూడా అని కొనియాడారు. వేల ఏళ్ల క్రితమే దళితులకు సమాజంలో సరైన గౌరవం కల్పించిన మహనీయుడు అని తెలిపారు. రామానుజాచార్యపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం విజయకీలాద్రిపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
ntr
balakrishna
ramajujacharya film
tollywood

More Telugu News