prabhas: దుబాయ్ కి 'సాహో' టీమ్ .. వచ్చే జనవరిలో రిలీజ్

  • ప్రభాస్ హీరోగా 'సాహో'
  • కథానాయికగా శ్రద్ధా కపూర్ 
  • త్వరలో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ  
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన ఈ సినిమా టీమ్, వచ్చేనెల చివరిలో 'దుబాయ్' వెళ్లనున్నారు. దాదాపు రెండు నెలల పాటు అక్కడ షూటింగ్ జరపనున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను అక్కడ ప్లాన్ చేశారు.

అనుమతులు రాకపోవడం వలన అక్కడి షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. దుబాయ్ లో చిత్రీకరించనున్న యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. దుబాయ్ షెడ్యూల్ తో ఈ సినిమా 50 శాతం వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంటుందట. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, వచ్చే ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.   
prabhas
shraddha kapoor

More Telugu News