brahmaji: అప్పుడుగానీ తెలియలేదు...అప్పటికి కృష్ణవంశీ భోజనం చేసి రెండు రోజులైందని!: బ్రహ్మాజీ

  • 'నిన్నేపెళ్లాడుతా' సమయంలో మంచి స్నేహితులమయ్యాం
  • కృష్ణవంశీ పస్తులుంటాడు కానీ ఎవరినీ చేయి చాచి అడగడు
  • ఒక్కపూట భోజనానికి కృతజ్ఞతగా సినిమాల్లో అవకాశం ఇచ్చాడు
కృష్ణవంశీకి డబ్బు సాయం చేశానన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సినీ నటుడు బ్రహ్మాజీ తెలిపారు. అలీతో జాలీగా కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మజీ తన కెరీర్ కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణవంశీ పస్తులుంటాడు కానీ, ఎవరినీ చేయి చాచి అడగడని అన్నారు. 'కనీసం తాను ఇబ్బందుల్లో ఉన్నానని కూడా చెప్పడు. అదీ అతని క్యారెక్టర్' అన్నారు బ్రహ్మాజీ.

"ఒకసారి మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చుంటే సమయం తెలియలేదు. రాత్రి 8.30 అవుతోంది, ఆకలేస్తోంది. మెస్‌ లో కార్డు ఉండడంతో ‘వంశీ రా భోజనం చేద్దాం’ అని తీసుకెళ్తే కానీ ఆయన చెప్పలేదు, అప్పటికి తను భోజనం చేసి రెండు రోజులకు పైనే అయిందని. ఈ సినిమాలు అవీ మానేసి ఇంటికి వెళ్లిపోదాం! అని అనుకున్నాడట. కానీ, ఇంకోరోజు చూద్దాం అనుకుని వేచి చూస్తున్నాడట. ఇంతలో నేను భోజనానికి పిలిచాను... అది కృతజ్ఞతగా భావించి తన సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చాడు" అని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.

మద్రాసులోనే తనకు కృష్ణవంశీ తెలిసినప్పటికీ అది ముఖపరిచయమేనని, నిన్నే పెళ్లాడుతా సినిమా సమయంలో ఇద్దరం బాగా కలిసిపోయామని, సింధూరం సినిమా షూటింగ్ లో ఉండగా చాలా ఆఫర్లు వచ్చాయని, కానీ, ఆ సినిమా ఫెయిల్ కావడంతో నిర్మాతలు కనబడకుండాపోయారని బ్రహ్మాజీ తెలిపారు. 
brahmaji
krishnavamshi
Film difficulties

More Telugu News