Pawan Kalyan: అదంతా పవన్ కల్యాణ్ కు నాపై వున్న అభిమానం!: స్పందించిన వీహెచ్
- నేను సీఎం కావాలనుకోవడం పవన్ అభిమానం
- ఆ వ్యాఖ్యలను మా అధిష్టానం దృష్టికి ఎవరో ఒకరు తీసుకెళతారు
- పవన్ నాపై సానుకూల వ్యాఖ్యలు చేయడం కాదు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను గుర్తించాలి: వీహెచ్
తెలంగాణ సీఎం అభ్యర్థిగా వి.హనుమంతరావు (వీహెచ్)ను ప్రకటిస్తే, ఆ పార్టీ తరపున తాను ప్రచారం చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు. ‘మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాను. అంచెలంచెలుగా పైకి వచ్చానని పవన్ వ్యాఖ్యల అర్థం అయి ఉండొచ్చు. నేను సీఎం కావాలనుకోవడం పవన్ అభిమానం.
అయితే, కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిని అధిష్ఠానం నిర్ణయిస్తుంది. పవన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి ఎవరో ఒకరు తీసుకెళతారు. నేను పవన్ తో పాటు వెళ్లడం కాదు.. పవన్ నాతో కలిసి వస్తానంటే కనుక పల్లెల్లో రైతుల కష్టాలు, ప్రాజెక్టుల్లో అవినీతి నిరూపిస్తా. పవన్ కల్యాణ్ లో ఇంకా మార్పు రావాలి. పవన్ నాపై సానుకూల వ్యాఖ్యలు చేయడం కాదు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను గుర్తించాలి. పవన్ పై నేను చేసే విమర్శలు ఆయన చేసే కామెంట్ మేరకు ఉంటాయి’ అని మీడియాతో వీహెచ్ అన్నారు.