rajanikanth: రజనీకాంత్, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాణిస్తారు: హీరో రానా

  • వాళ్లిద్దరూ సినీ రంగంలో లెజెండ్స్
  • ఎంతో ప్రభావితం చేయగల వ్యక్తులు
  • సినిమా వాళ్లు ఏ రంగంలోనైనా రాణిస్తారు: దగ్గుబాటి రానా
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లు రాజకీయాల్లో రాణిస్తారని ప్రముఖ హీరో దగ్గుబాటి రానా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని మీడియా పలుకరించగా.. సినిమా వాళ్లు ఏ రంగంలోనైనా రాణిస్తారని, వాళ్లిద్దరూ సినీ రంగంలో లెజెండ్స్ అని, తమకు నచ్చిన మార్గాలను వారు ఎంచుకున్నారని, ఎంతో ప్రభావితం చేయగల వ్యక్తులను ఆయన ప్రశంసించారు. ‘భవిష్యత్ లో మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారా?’ అనే ప్రశ్నకు రానా సమాధానమిస్తూ, రాజకీయనాయకుడి పాత్రలో సినిమాల్లో నటించడమే తప్ప, నిజజీవితంలో మాత్రం రాజకీయాల్లోకి రానని చెప్పారు. 
rajanikanth
Pawan Kalyan
daggubati rana

More Telugu News