'ఛలో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిరూ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఛలో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిరూ!

  • నాగశౌర్య తాజా చిత్రంగా 'ఛలో'
  • కథానాయికగా రష్మిక మందన 
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు 
  • వచ్చేనెల 2వ తేదీన విడుదల  
తెలుగు తెరపై సందడి చేస్తోన్న యువ కథానాయకులలో నాగశౌర్య ఒకరుగా కనిపిస్తాడు. ఆయన ఖాతాలో హిట్స్ తో పాటు .. యూత్ లో మంచి క్రేజ్ వుంది. అలాంటి నాగశౌర్య తాజా చిత్రంగా 'ఛలో' తెరకెక్కింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రష్మిక మందన కథానాయికగా నటించింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు సాయంత్రం 6:30 గంటలకు జరపనున్నారు. హైదరాబాద్ - యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరవుతూ ఉండటం విశేషం. నాగశౌర్య సొంత బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి, సాగర్ మహతి సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.   
chiranjeevi
nagashourya

More Telugu News