Krishna Kumari: ముందుగా రేపు అనుకున్నాం... కానీ ఇవాళే కృష్ణకుమారి అంత్యక్రియలు: షావుకారు జానకి

  • ఈ ఉదయం కన్నుమూసిన కృష్ణకుమారి
  • రేపు కర్ణాటకలో బంద్
  • నేడే అంత్యక్రియలన్న షావుకారు జానకి
బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ ఈ ఉదయం బెంగళూరులో మరణించిన సీనియర్ నటి కృష్ణకుమారి అంత్యక్రియలు నేటి సాయంత్రం 4 గంటలకు జరుగుతాయని ఆమె సోదరి మరో సీనియర్ నటి షావుకారు జానకి స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, గురువారం నాడు అంత్యక్రియలు జరపాలని తొలుత భావించామని, అయితే రేపు కర్ణాటకలో బంద్ జరగనున్న కారణంతో నేడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం పార్థివదేహాన్ని రేపటి వరకూ ఉంచాలని భావించినా, వీలు కాకపోయిందని అన్నారు. రావాల్సిన వాళ్లు రాలేకపోతుండటం దురదృష్టకరమని అన్నారు. బెంగళూరులోని ఎలక్ట్రిక్ క్రిమటోరియంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. తన సోదరి లేని లోటు తీరనిదని, తన కుటుంబానికి సంతాపం తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని ఆమె వ్యాఖ్యానించారు.
Krishna Kumari
Shavukar Janaki
Banglore

More Telugu News