Pawan Kalyan: అభిమానులూ అర్థం చేసుకోండి: పవన్ కల్యాణ్

  • అభిమానులను కలవడం కుదరడం లేదు
  • ప్రజాయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను
  • అభిమానులు అర్ధం చేసుకోవాలి
అభిమానులకు జనసేనాని పవన్ కల్యాణ్ విన్నపం చేశారు. ప్రజాయాత్రలో భాగంగా అభిమానులను కలవడం కుదరడం లేదని, దీనిని వారు దయచేసి అర్థం చేసుకోవాలని సూచించారు. కొత్తగూడెం నుంచి ఖమ్మం బయల్దేరి వెళ్తూ, కరీంనగర్ లో బస చేసిన హోటల్ వద్దకు పవన్ ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు చేరుకోవడంతో చోటుచేసుకున్న సంఘటనలు గుర్తుచేసుకున్న ఆయన, అభిమానులు గాయపడితే తాను బాధపడతానని చెబుతూ, తాను ప్రతి ఒక్కరినీ కలవడం ప్రస్తుతం కుదరదని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానన్న విషయాన్ని అభిమానులు గుర్తించాలని ఆయన సూచించారు. కాగా, పోటెత్తుతున్న అభిమానుల అత్యుత్సాహంతో పలువురు గాయపడుతుండడం తెలిసిందే.

Pawan Kalyan
prajayatra
tour telangana

More Telugu News