Padmavat: 'పద్మావత్' ఓ అద్భుతం... ప్రివ్యూ చూసిన ప్రముఖుల అభిప్రాయం!

  • అత్యంత వివాదాస్పదమైన 'పద్మావత్'
  • అందరూ చక్కగా నటించారని కితాబిస్తున్న ప్రముఖులు
  • గొప్ప విజయాన్ని సాధించనుందని ప్రశంస
అత్యంత వివాదాస్పదమైన సంజయ్ లీలా భన్సాలీ చిత్రం 'పద్మావత్' విడుదలకు సిద్ధం కాగా, ఈ సినిమాను ప్రివ్యూ చూసిన పలువురు ప్రముఖులు ఇది ఓ అద్భుత చిత్రమని అభిప్రాయపడుతున్నారు. దీపిక కళ్లతోనే అద్భుతం చేసిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమెతో పాటు షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ లు చాలా బాగా నటించారని స్టార్ హీరో హృతిక్ రోషన్ పొగడ్తలు గుప్పించాడు.

ఎన్ని వివాదాలు వచ్చినా సినిమా గొప్ప సక్సెస్ ను కళ్ల జూడనుందని బాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆ పద్మావతీ దేవి ఈ చిత్రాన్ని ఆశీర్వదించిందని కూడా కామెంట్లు వస్తున్నాయి. ఇక సినిమాలో రాజ్ పుత్ వర్గం మహిళలను కించపరిచేలా ఎలాంటి సన్నివేశాలూ లేవని భరోసాను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ చూసేలా చిత్రం ఉందని, ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందని కితాబిస్తున్నారు. కాగా, రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం ప్రివ్యూ షోలను హైదరాబాద్ లో నేటి సాయంత్రం నుంచి పలు థియేటర్లలో ఏర్పాటు చేశారు.
Padmavat
Deepika Padukone
Ranveer Kapoor
Sanjay Leela Bhansali

More Telugu News