Rajinikanth: రజనీకాంత్‌, కమలహాసన్‌ రాజకీయ ప్రవేశంపై స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • రాజకీయాల్లోకి వస్తున్నామంటూ ఇటీవలే రజనీ, కమల్ ప్రకటనలు
  • కొత్త పక్షులు ఎగరాలనుకుంటున్నాయి-స్టాలిన్
  • అవి ఎంత దూరం ఎగరగలవో చూడాలి
  • ప్రజాస్వామ్యం ఆకాశం వంటిది.. అన్ని పక్షులకు ఒకటే విధంగా ఉంటుంది
రాజకీయాల్లోకి వస్తున్నామంటూ సినీనటులు రజనీకాంత్‌, కమలహాసన్ ఇటీవల ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరి రాజకీయ ప్రవేశంపై తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే నేత స్టాలిన్ స్పందించారు. కొత్త పక్షులు ఎగరాలనుకుంటున్నాయని, అవి ఎంత దూరం ఎగరగలవో చూడాలని తమ పార్టీ నేతలకు రాసిన లేఖలో స్టాలిన్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఆకాశం వంటిదని, అన్ని పక్షులకు ఒకటే విధంగా ఉంటుందని ఆయన చెప్పడం గమనార్హం. ఈ రాజకీయ వాతావరణం గురించి తెలుసుకున్న కొత్త పక్షులు ప్రస్తుతం ఎగరాలనుకుంటున్నాయని చురకలంటించారు.   
Rajinikanth
Kamal Haasan
politics
stalin

More Telugu News