Pawan Kalyan: పవన్ కల్యాణ్ ది కామెడీ ఎపిసోడ్ లాంటిది!: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

  • పవన్ కల్యాణ్ చేసే వ్యాఖ్యలకు అర్థం ఉండదు
  • తోలుబొమ్మలాటలో ‘కేతిగాడు’లా వస్తుంటారు
  • చంద్రబాబు ఎప్పుడు మీట నొక్కితే అప్పుడొస్తారు
  • జనసేనానిపై విమర్శలు గుప్పించిన ఆదిశేషగిరిరావు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శలు గుప్పించారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పవన్ కల్యాణ్ గారు చేసే వ్యాఖ్యలకు అర్థం ఉండదు. తోలుబొమ్మలాటలో కేతిగాడు వచ్చినట్టుగా మధ్యమధ్యలో వచ్చి ఆయనేదో మాట్లాడి వెళుతుంటారు. పవన్ కల్యాణ్ ది కామెడీ ఎపిసోడ్ లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీట నొక్కితే అప్పుడు వచ్చి మాట్లాడి వెళిపోతుంటారు. ఏపీలో పలు సమస్యలు ఉంటే సరైన సమయంలో పవన్ కల్యాణ్ స్పందించారా? టీడీపీ ఏం కావాలంటే ‘జనసేన’ అది మాట్లాడుతోంది’ అని చెప్పుకొచ్చారు. 
Pawan Kalyan
YSRCP

More Telugu News