Mahesh Babu: ఏ రాజకీయపార్టీకైనా మహేశ్ బాబు మద్దతిస్తానంటే ... ‘వద్దురా’ అని నేనే చెప్పొస్తా: ఆదిశేషగిరిరావు

షార్ట్స్‌లో చూడండి
నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీకి ‘కృష్ణ - మహేశ్ సేన’ ఇటీవల మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై వైసీపీ నేత, ప్రముఖ హీరో మహేశ్ బాబు బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావుని ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ‘వైసీపీకి ‘కృష్ణ - మహేశ్ సేన’ ఫ్యాన్స్ మద్దతివ్వడమంటే, ఆ పార్టీకి మహేశ్ బాబు మద్దతు ఇచ్చినట్టు కాదు. మహేశ్ బాబు ఏ రాజకీయపార్టీలోకి వెళ్లకూడదు. మహేశ్ అందరికీ కావాల్సిన వ్యక్తి.. హీ ఈజ్ ఏ స్టార్. అందరికీ మహేశ్  కావాలి..మహేశ్ కు అందరూ కావాలి. ఒకవేళ, ఏ రాజకీయపార్టీకైనా మహేశ్ బాబు మద్దతిస్తానంటే ... ‘వద్దురా’ అని నేనే చెప్పొస్తా’ అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Mahesh Babu
Tollywood

More Telugu News