Chandrababu: దావోస్ లో చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్

  • చంద్రబాబు, లోకేష్ లతో కేటీఆర్ సమావేశం
  • లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
  • వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ లో ఉన్న నేతలు
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిశారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ కు కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్, లోకేష్ సమావేశంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం వీరంతా దావోస్ లో ఉన్నారు.
Chandrababu
Nara Lokesh
KTR

More Telugu News