sensex: రికార్డుల‌ను తిర‌గ‌రాస్తున్న దేశీయ సూచీలు... ఆనందంలో మ‌దుప‌ర్లు!

  • 36వేల మార్కుని దాటిన సెన్సెక్స్‌
  • 11వేల మైలురాయిని దాటిని నిఫ్టీ
  • ఆరంభం నుంచే లాభాల జోరు

గ‌త ప‌ది రోజులుగా దేశీయ‌ మార్కెట్లు లాభాల బాటలో కొన‌సాగుతున్నాయి. కొత్త కొత్త రికార్డుల‌ను సృష్టిస్తున్నాయి. ఇవాళ కూడా సెన్సెక్స్‌, నిఫ్టీలు స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించాయి. దీంతో మ‌దుప‌ర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మార్కెట్‌ చరిత్రలో తొలిసారి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 36వేల మైలురాయిని, జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 11వేల మైలురాయిని దాటాయి.

మంగళవారం ఆరంభం నుంచే సూచీలు రికార్డుల బాట పట్టాయి. బ్యాంకింగ్, టెలికాం, ఐటీ రంగాల షేర్లలో పెట్టుబ‌డులు పెర‌గ‌డంతో ట్రేడింగ్‌ మొదలైన కొద్ది సేపటికే నిఫ్టీ 11వేల బెంచ్‌మార్క్‌ను, సెన్సెక్స్‌ 36వేల మార్కును దాటాయి. ఇక మార్కెట్ ముగిసే స‌మ‌యానికి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 342 పాయింట్ల లాభంతో 36,140 వద్ద, నిఫ్టీ 1శాతం పెరిగి 117 పాయింట్లు ఎగబాకి 11,084 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 63.81గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో  వేదాంతా లిమిటెడ్‌, గెయిల్‌, ఎస్‌బీఐ, హిందాల్కో, టాటాస్టీల్‌ షేర్లు రాణించాయి. ఒక్కో కంపెనీ షేరు విలువ సగటున 3 నుంచి 4శాతం పెరిగింది. ఇక ఐషర్‌ మోటార్స్‌, అంబుజా సిమెంట్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, విప్రో, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు నష్టపోయాయి.

More Telugu News