Pawan Kalyan: నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు బినామీ!: వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

  • నాటి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బాబుకు అవకాశాలొచ్చాయి
  • అయినా అలా చేయలేదు!
  • చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి నాడు కుమ్మక్కయ్యారు
  • ఆ ప్రభుత్వం కూలితే జగన్ కు అవకాశమొచ్చేది : ఆదిశేషగిరిరావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు బినామీ గవర్నమెంట్ గా ఉండేదని వైసీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. ‘ఐ డ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబుకు అనేక అవకాశాలు వచ్చినప్పటికీ ఆ ప్రయత్నం చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోయి, ఎన్నికలు వచ్చినట్టయితే జగన్ కు అవకాశం వచ్చేది.

ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ప్రతిపక్షానికి వచ్చినప్పుడు, పడగొట్టకుండా, ఎందుకు నిలబెడతారు? వాళ్లిద్దరూ (చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి) కలిసి కుమ్మక్కై మూడేళ్లు కాలం గడిపారు. నాడు రాష్ట్ర విభజనకు ముఖ్యకారణం చంద్రబాబునాయుడు గారే. మరొకరిపై ఈ నింద వేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజనపై ఈ రోజున చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు’ అని ఆరోపించారు.
Pawan Kalyan
ghattamaneni

More Telugu News