nail polish: ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన నెయిల్ పాలిష్... ధ‌ర రూ. 1,63,66,000

షార్ట్స్‌లో చూడండి
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన గోళ్ల రంగును లాస్ ఏంజెలీస్‌కి చెందిన అజాట్యూర్ అనే సంస్థ త‌యారుచేసింది. దీని ధ‌ర అక్ష‌రాల 250,000 డాల‌ర్లు.. అంటే రూ. 1,63,66,000. ఈ నెయిల్ పాలిష్‌ని 267 కేర‌ట్ల న‌లుపు రంగు వ‌జ్రాల‌ను మేళ‌వించి త‌యారుచేశారు. కేవ‌లం ఒకే ఒక్క బాటిల్‌ను త‌యారు చేసిన‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. ఆ ఒక్క బాటిల్‌ను త్వ‌ర‌లో ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి పెట్ట‌నున్నారు.

గ‌తంలో మోడ‌ల్స్ ఓన్ అనే కంపెనీ త‌యారు చేసిన గోల్డ్ ర‌ష్ నెయిల్ పాలిష్ పేరిట ఉన్న రికార్డును ఈ కొత్త నెయిల్ పాలిష్ తిర‌గ‌రాసింది. గోల్డ్ ర‌ష్ నెయిల్ పాలిష్ ధ‌ర 130,000 డాల‌ర్లు .. అంటే రూ. 83 ల‌క్ష‌లు. ఇప్పుడీ బాటిల్‌ను ఎవ‌రు కొంటారో చూడాలి మ‌రి!
Go Back to Shorts
nail polish
azture
models own
black diamond

More Telugu News