Pawan Kalyan: పవన్ కల్యాణ్ తన జనసేనను టీఆర్ఎస్లో విలీనం చేస్తే మంచిది: జీవన్‌రెడ్డి
- అది జనసేన కాదు.. భజనసేన
- కేసీఆర్ సమర్థంగా పనిచేస్తున్నారా?
- అయితే, ఇక తెలంగాణలో జనసేన ఎందుకు?
- పవన్ యాత్రకు అనుమతి ఎలా ఇచ్చారు?
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేపట్టిన యాత్రపై కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం విద్యార్థులు ర్యాలీ చేస్తామంటే అనుమతి ఇవ్వలేదని, మందకృష్ణ దీక్ష చేపడితే జైల్లో పెట్టారని, మరి పవన్ యాత్రకు మాత్రం అనుమతి ఎందుకు ఇచ్చారని నిలదీశారు.
పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కాదని, భజనసేన అని అన్నారు. అప్పట్లో కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 'కేసీఆర్ సమర్థంగా పనిచేస్తున్నారా? అయితే, ఇక తెలంగాణలో జనసేన ఎందుకు?' అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తన జనసేనను టీఆర్ఎస్లో విలీనం చేస్తే మంచిందని చురకలంటించారు.